త్వరలో “రాకెట్ రోకో”అనే కార్యక్రమం…

· ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ
రచయితలు

పీఎస్ఎల్వీ-సీ 18 ప్రయోగం విజయవంతం
అందరి సమిష్టి కృషి : రాధాకృష్ణన్

శ్రీహరి కోట, అక్టోబర్ 12 : పీఎస్ఎల్వీ – సీ 18 ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. మేఘా ట్రాపిక్స్, మూడు నానో ఉపగ్రహాలను క్షక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో షార్‌లో ఆనందోత్సాహలు వెలువడుతున్నాయి.ఈ సందర్భంగా ఇస్రో చైర ్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఇది అందరి సమిష్టి విజయమని కొనియాడారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

ఈ ఘన విజయం గురించి విలేకరులు వివిద రాజకీయనాయకుల స్పందనలని సేకరించారు.ముందుగా…

సిఎం : ముందుగా శాస్త్రవేత్తలకందరికి అభినందనలు. ఇంతటి ఘనవిజయాలని సాదిస్తున్న శ్రీహరికోట మన అంధ్రప్రదేశ్‌లో ఉండడం  మనకందరికి గర్వకారణం.
చంద్రబాబు: ఇది చాల శుభ దినం, శాస్రవేత్తలకి అభినందనలు. ఇస్రో మరిన్ని విజయాలతో ముందుకుపోవాలని ఆశిస్తున్నం.
జెపి(లోక్‌సత్తా): ఈ విజయాలు మనజాతికి ఎంతో స్పూర్థినిస్తాయ్.యువత ఈ విజయాలని చూసి స్పూర్తి పొంది తమ తమ రంగాలలో విజయాలని సాదించేదానికి పూనుకోవాలి.
నారాయణ(సిపిఐ): దేశంలో ఇన్ని కుంభకోణాలు,కార్మికుల ఆకలి చావులు జరుపుకుంటుంటే ప్రభుత్వం రాకెట్లు,సాటిలైట్లు వదులుకుంటుంటే ఎలా? ముఖ్యంగా తెలంగాణా సమస్య తేలుస్తే మంచిది.
రాఘవులు(సిపిఐ): మంచి విషయమేకాని, ఈ సాటిలైట్లు పెట్టుబడిదారులకి ముఖ్యంగా అమెరికా,ఫ్రాన్స్ లాంటి బూర్జువా దేశాలకి మన ఇస్రో సేవలందించడం అనేది మన ప్రభుత్వం వారికి సిగ్గుచేటు.
వెంకయ్యనాయుడు:  శాస్త్రవేత్తలకి అభినందనలు. దేశంలో వరుసగా జరుగుతున్న కుంభకోణాలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇస్రో ఇలా వరుసవిజయాలని సాధిస్తుందేమోనని అనుమానంగాఉంది.
ఒవైసి(ఎం ఐ ఎం): అచ్చా కభర్‌హై.గాని ఈ రాకెట్లు మా ముస్లిం జనం జీవితాలకి ఏమి పనికి వస్తయ్. మా యువతకి పనికివచ్చెట్లు ఈ సాటిలైట్లు ఉండాలని”సచ్చార్ కమిటీ”వాల్లకి జెప్తాం. గీ రాకెట్లని వదిలేముందు మమ్ములని సంప్రదించనందుకు మేము నిరసనదెల్పుతున్నం.
కచరా: అరె ఇదేందిరాబై, ఓపక్కన మా తెలంగాణాకోసం సకలజనుల సమ్మె జేస్తుంటే గీ ఇస్రోగాల్లు రాకెట్లు,సాటిలైట్లు వదులుకుంటా ఖుషీ చెసుకుంటరా అని అడుతున్నం.గా సాటిలైత్లతో మా తెలంగాణాలో చచ్చిన  700 మంది పిల్లల ప్రాణాలు తిరిగి తీసికొస్తావా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నం. రేపు మా తెలంగాణా వచ్చినాక పది జిల్లాలలో ఒక్క రాకెట్ లాంచింగ్ సెంటర్లు బెడతం. గిప్పుడేంది క్రీస్తుకు పూర్వమే  ఇక్కడ మా తెలంగాణాలో ఇంతకన్న పెద్ద రాకెట్లు,సాటిలైట్లు,తొక్కలో తెట్లు జబ్బర్దస్తిగా వదిలినం. జూసినరురాబై ఎప్పుడూ గా సీమాంద్రలోనే ఈ రాకెట్లు వదులుతున్నరు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా మా తెలంగాణ నుండి ఒక్కటంటే ఒక్క దిక్కుమాలిన రాకెట్టు అయినా వదిలిన్రా అని అడుగుతున్నం.గింత వివక్ష జూస్తేనైనా మీకు ఈ సీమాంధ్రుల పక్షపాత బుద్ది కనిపించడములేదా? తొందరలో తెలంగాణా ఇబ్బకుంటే ఈ నెలాఖరుకి ఉస్మానియా యూనివర్సిటి విధ్యార్దుల సహకారముతో దూంధాం కార్యక్రమంలో మేమే ఒక సొంత రాకెట్టు వదులుతం.దెబ్బకి అది ఢిల్లీ నాయకుల మత్తువదిలిస్తది.

కోదండరాం: తెలంగాణ వచ్చేవరకు ఇక ఏ రాకెట్లు వదిలేదానికి మేము ఒప్పుకోం. త్వరలో “రాకెట్ రోకో”అనే కార్యక్రమం రూపొందిస్తం.

విజయశాంతి: ముందు తెలంగాణ సంగతి తేల్చి తరువాత రాకెట్లు సంగతి తేలుద్దాం. మా తెలంగాణా డిమాండు తొందరలో తేల్చకపోతే ఈ విజయశాంతి విశ్వరూపమేంటో చూస్తారు. తరువాత వదలబోయే రాకెట్టుని నేనొక్కదాన్నే అడ్డుకుంటా.అసలది పైకి ఎలా వెళ్తుందో చూస్తా ఆ!

జూపల్లి: మేమంతా రాజీనామాలు చేసి గమ్మునుంటే ఇస్రో వాల్లు రాకెట్లు పంపిస్తారా.ఇది ఇస్రోని మానేజ్ చేయడమే?ఇస్రో చైర్మన్ కూడా రాజీనామా చేసి గమ్మునుండాలి.
కోమటి రెడ్డి: ఇక్కడ తెలంగాణాలో ఇంత ధారుణంగా సకలజనుల సమ్మె జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఈ రాకెట్లు,సాటిలైట్లు వదులుకునెదానికి సీమాంధ్ర వారికి సహకరిస్తునరు.ఇక భవిష్యత్తులో వదలబోయె రాకెట్లకి అడ్డుగా వలలు పెడతం.చుట్టూ గోడలు కడతం.

మధుయాష్కీ: ఓపక్క రాష్ట్రమంతా సకలజనులసమ్మెతో సామాన్యప్రజలు ముఖ్యంగా తెలంగాణా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ రాకెట్టు వదలడం మా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలని రెచ్చగొట్టడమే.దీని మీద నిరసన తెలియజేస్తాం మా హైకామాండు వారికి.
పొన్నం ప్రభాకర్: తెలంగాణా ముఖ్యమా ఈ రాకెట్టు వదులుడు ముఖ్యమా.ఎవర్నడిగి ఇది వదిలాడు.110 మంది మా తెలంగాణా శాసనసభ్యులని,పదిహేను మంది పార్లమెంటు సభ్యులని అవమానపరచడమె.గీ ముఖ్యమంత్రి మీద మా హైకమాండుకి పిర్యాదు చేస్తం.

నాగం జనార్ధన్ రెడ్డి: అన్ని సక్కగా జరిగిపోతయ్.ఈ కేంద్రానికి,రాష్ట్రప్రభుత్వానికి సిగ్గు,శరం ఉంటే ముందు తెలంగాణా ఇచ్చి ఆ తరువాత గీ రాకెట్లు,సాటిలైట్లు వదులుకోమనండి.చంద్రబాబు ఒక్క లెటరు మరొక్కసారి తెలంగాణాకి అనుకూలంగా ఇవ్వడుకాని అన్నింటికి ముందుంటడు గీ ఇస్రో వాల్లని అభినందించేదానికి,యాత్రలు చేయడానికి.అయ్యా దయాకరరావు ముందు మీ నాయకుడి చేత ఒక్క లెటరు కేంద్రప్రభుత్వానికి ఇప్పించు లేదంటే ఆ రాకెట్టుతో పాటు నిన్ను,ఈ సీమాంద్ర పక్షపాత తెలుగుదేశాన్ని మా తెలంగాణా ప్రజలు ఆకాశంలోనికి పంపిస్తరు,జాగ్రత్త.

చిరంజీవి: మా సోనియాజి సమర్ధ నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకెట్లని అలవోకగా పంపిస్తుంది అనటం అతిశయోక్తి కాదు.ముందు ముందు చందృడిమీదకి,సూర్యుడి మీదకి కూడా మేము ఇలా రాకెట్లు పంపిస్తూ ఉంటాం.ఈ విషయాలని చర్చించేదానికి నేను త్వరలో ఢిల్లీ వెళతాను.
లగడపాటి రాజ్‌గోపాల్: చూసారా రాష్ట్రం,దేశం సమైక్యంగా ఉంటేనే ఇలా రాకెట్లని,సాటిలైట్లని విజయవంతంగా ప్రయోగించగలం.ఇలా తెలంగాణా అని,మన్యసీమ అని గ్రేటర్ రాయలసీమ అని రాష్ట్రం ముక్కలు చెక్కలు చేసుకుంటూ పోతే విఫలమైన రాకెట్టులా బంగాళాఖాతంలో కలిసిపోతాం.

సుమన్(తెలంగాణా విధ్యార్ది జాక్): ఇక తెలంగాణా వచ్చేవరకు ఏ రాకెట్లు వదలకూడదు.మమ్మల్ని కాదని వదులుతే అడ్డంగా నరుకుతం.ఇస్రోని తగలబెడతం.

కేశవరావ్(కాంగ్రెస్స్ నాయకుడు):దిస్ ఈజ్ టొటల్ రబ్బిష్, నాలుగు కోట్ల ప్రజలు సకల జనుల సమ్మెతో బద్నాం అవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. హమరా లోగో పూరా బందు చేస్త ఉంటే నోబడి టేక్‌కేర్, అసలు సాటిలట్ వదులుడు ముఖ్యమా,మా ప్రజల ఆకాంక్ష ముఖ్యమ, ఇ విల్ డిస్కస్ థిస్ మటర్ విత్ మై హైకమాండ్.లేదంటే రాజీనామా జేస్తం.దిస్ ఈజ్ లాస్ట్,ఇక ఉపేక్షించేది లేదు, తెలంగాణా ఇచ్చినంకనే రాకెట్లు,సాటిలైట్లు, మా తెలంగాణా నాయకులమందరం కూర్చుని ఒక ఫైనల్ దెషిషంకి వస్తం. కెసీఆర్ను కూడా కలుపుకుని వెళతాం.మే జాదూ సె బాత్,హూ ఎవర్ ఇట్ మయ్ బి రాజీలేదు,ఫైనల్,లాస్ట్,త్వరలో జెప్తం,వేట్ అండ్ సీ.

అభిప్రాయములు

Comments RSS
  1. john

    /రేపు మా తెలంగాణా వచ్చినాక పది జిల్లాలలో ఒక్క రాకెట్ లాంచింగ్ సెంటర్లు బెడతం. గిప్పుడేంది క్రీస్తుకు పూర్వమే ఇక్కడ మా తెలంగాణాలో ఇంతకన్న పెద్ద రాకెట్లు,సాటిలైట్లు,తొక్కలో తెట్లు జబ్బర్దస్తిగా వదిలినం. జూసినరురాబై ఎప్పుడూ గా సీమాంద్రలోనే ఈ రాకెట్లు వదులుతున్నరు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా మా తెలంగాణ నుండి ఒక్కటంటే ఒక్క దిక్కుమాలిన రాకెట్టు అయినా వదిలిన్రా అని అడుగుతున్నం./

    భలే చెప్పారు. చాలా బాగుంది. ముఖ్యంగా కచరా dialogue.

    • సూటిగా >

      జాన్ గారు కృతజ్ఞతలు. మీరు చాలా చక్కగ ఓపికగా తెలబానీయులకి బుద్ధి చెబుతున్న వైనం బాగుంది. కీప్ ఇట్ అప్ :)

    • సూటిగా >

      ధన్యవాదాలు చదువరిగారు. మీ రాతలు,విశ్లేషణలు చక్కగా ఉంటాయ్.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.