వసివాడిన పసి త్యాగం 15 ఏళ్ల వయసులో సృజన ఆత్మాహుతి ఇది రెండు కుటంబాల వ్యధ

· తెలంగాణ
రచయితలు

వసివాడిన పసి త్యాగం
15 ఏళ్ల వయసులో సృజన ఆత్మాహుతి
పదో తరగతిలోనే త్యాగాల బాట

టీచర్ కావాల్సిన సందీప్‌దీ అదే దారి
ఇది రెండు కుటంబాల వ్యధ

______________________________________________________________

వ్యక్రిగత స్వార్ధాలతోరాజకీయ నిరుద్యోగులు ప్రేరేపించిన వ్యాపోరోద్యమాలకు బలియిపోయిన వారి కుటుంబాల సూటి ప్రశ్నలకు ఇప్పుడు ఏ ” ఉత్యమం” నాయకుడు జవాబు ఇవ్వరే? ఎంతసేపు 600 మంది 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుండెలు బాదుకుంటూ చావు బేరాలాడే దగుల్బాజీ రాజకీయ,ఉద్యమం పేరుతొ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునేవారిని ఇప్పుడు తెలంగాణ ప్రజలే బట్టలూడదీసి కొట్టవలసిన సమయం ఆసన్నమయింది!

తెలంగాణ ప్రజలారా కాస్త నిమ్మళంగా,నిజాయితీగా ఆలోచించండి.నిజాలు గమనించండి.

______________________________________________________________

2010 ఫిబ్రవరి 24…
ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయం.
ఇంట్లో మంటలు… ఆ మంటల్లో సృజన.
ఆదిలాబాద్ జిల్లా మాదాపూర్‌కు చెందిన లచ్చన్న, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వారిలో పెద్దమ్మాయి సృజన. పదో తరగతి చదువుతోంది. చదువంటే ఇష్టం. తెలంగాణ అంటే ఇంకా ఇష్టం. బడికి పోయినం త శ్రద్ధగా తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొనేది. 15 ఏళ్ల వయసులోనే… తెలంగాణ రావాల్సిన అవసరం, దానికి ఉన్న అడ్డంకులపై తీవ్రంగా ఆలోచించేది.

ఏమనుకుం దో, ఏమో… పోరాడి గెలవాల్సిన వయసులో త్యాగాల బాట పట్టింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన సృజనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. సృజన… చనిపోయింది! సృజన ఆత్మాహుతి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి సృజన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలోని ఒక యువజన సంఘం సృజన స్మారకార్థం ధూమ్ ధా మ్, క్రీడాపోటీలు నిర్వహించింది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆమె తల్లిదండ్రులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కానీ, ఇవేవీ సృజన లేని లోటు ను తీర్చేవి కావు. ఉండటానికి సొంత ఇల్లు లేదు. భూ మి లేదు. ఇప్పుడు… పెద్ద కూతురూ లేదు. మిగిలిన కూతుళ్లు మంజుల, స్వాతిలను చదివిస్తూనే.. పెద్దకూతు రు జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కులవృత్తితోనే జీవిస్తున్న లచ్చన్నను పలకరించగా కన్నీళ్లు వరదయ్యాయి. “బతికి సాధించుకోవాలి. ప్రా ణాలు తీసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగల్చవద్దు” అని లచ్చన్న దంపతులు యువతకు విజ్ఞప్తి చేశారు.

___________________________________________________________________________

ఓ సందీప్…
2010 ఫిబ్రవరి 14… మధ్యాహ్నం!

వరంగల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటలో భిక్షపతి తన సెలూన్‌లో పని చేసుకుంటున్నారు. అంతలో.. హృదయవిదారకమైన అరుపులు.. తలెత్తి చూస్తే.. కళ్ల ముందు కదులుతున్న నిప్పుల నెగడు! ఉవ్వెత్తున మంటలు. ఆ మంటల్లో సందీప్. అతను.. భిక్షపతికి ఒక్కగానొక్క కుమారుడు. తానెంత కష్టపడినా.. కొడుకును బాగా చదివించి ఉపాధ్యాయుడిని చేయాలని భిక్షపతి కలలు కన్నారు.

పరకాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో టీటీసీలో చేర్పించారు. మంచి విద్యార్థి అయిన సందీప్.. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించేవాడు. కవితలు, పాటలూ రాసేవాడు. ఉద్యమ ఉద్రేకంలో, ఆత్మాహుతికి ఒడిగట్టాడు. మంటల్లో కాలుతున్న కుమారుడిని చూసి భిక్షపతి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న సందీప్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయినా, ఫలితం లేకపోయింది. ఆ మరుసటిరోజే సందీప్ కన్నుమూశాడు.

వెంటాడుతన్న పేదరికం
చెట్టంత ఎదిగి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు.. అందునా ఒక్కగానొక్క కొడుకు.. కళ్లముందే అగ్నికి ఆహుతి అయిపోవడంతో భిక్షపతి కుటుంబం కుంగిపోయింది. రేపోమాపో కూలిపోయేలా ఉన్న చిన్న పెంకుటిల్లు. పెళ్లీడుకొచ్చి, డిగ్రీ చదువుతున్న కూతురు. రోజూ గోలీలు మింగితేకానీ బతుకులేని భార్య! సెంటు భూమి లేదు! ఇదీ భిక్షపతి కుటుంబం పరిస్థితి. పూర్తిగా క్షౌర వృత్తిపైనే ఆధారపడటం, ఆదాయం అంతంత మాత్రమే కావడంతో కడివెడు కష్టాలు అనుభవిస్తున్నారు. సందీప్‌కు అప్పట్లో టీఆర్ఎస్, టీడీపీ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు.

టీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి రూ.10 వేలు, సత్యనారాయణ రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆస్పత్రి ఖర్చులను నాగుర్ల వెంకటేశ్వరరావు భరించారు. పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ ఓదార్పు పేరిట రూ.25వేలు అందించారు. ఇది జరిగి దాదాపు రెండేళ్లయింది. ఇప్పుడిక భిక్షపతి కుటుంబాన్ని పట్టించుకునే వారు లేరు. ఆయన అప్పుడప్పుడు అమర వీరుల కుటుంబాలు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. “కొడుకు పోయాడు. కనీసం వాడి ఆశయం నెరవేరితే చాలు” అని భిక్షపతి కన్నీటిపర్యంతమవుతున్నారు.

______________________________________________________________________________

సౌజన్యం : ఆంధ్రజ్యోతి (02-2-2012)

అభిప్రాయములు

Comments RSS
  1. తాడిగడప శ్యామలరావు

    చిన్న చిన్న పిల్లలు త్యాగాలు చేయటమేమిటి?
    అసలు త్యాగమంటే యేమిటో యెందుకో తెలిసే వయసా వారిది?
    పసివాళ్ళ మనసుల్లో ఆవేశం రగలించి సెగలు యెగదోసి కొందరు పబ్బం గడుపుకుంటారు.
    పాపం తెలిసీతెలియని వయసులో యేదో గొప్పపని చేస్తున్నామన్న భ్రమలో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు.
    ఇలా రాలిన పసికుసుమాల ఉసురుల మసి లోంచి స్వలాభసృష్టి చేసుకుంటున్నారు దుర్మార్గులైన నాయకమ్మన్యులు.
    చాలా విచారించవలసిన విషయం.

  2. సూటిగా >

    అవును శ్యామలరావు గారు.బుద్ధి,మనసు ఉన్నవారెవరైనా మీతో ఏకీభవిస్తారు.ఇది తెలంగాణ ప్రజలు గుర్తించాలి.మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

  3. Srinivas Yadav

    యదవ తిరుగుళ్ళు తిరిగి కడుపోచ్చి ఆత్మహత్య చేసుకొని ఉంటది..
    తెలంగాణా మసి అంటిస్తే .. విషయం ఎవ్వరికి తెలియదు.. పేరుకి పేరు డబ్బుకి డబ్బు.
    ఆహా ..మన తెలంగాణాలో ఎంత అభివృద్ధి ?

    • సూటిగా >

      ఇలాంటి ఆరోపణలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నవారి మీద వచ్చాయి. ఈ తెలంగాణ ఉద్యమంలో కొత్త కోణం ఏమిటంటే ఆత్మహత్యలు ఎవరికీ వారు స్వంతంగా చేసుకుంటారు.కాని ఇక్కడ మాత్రం నాయకులు ఆత్మహత్యలు “చేస్తారు” !!! ఒక వ్యక్తి ఇలా కామెంటు చేసారు. నిజమే అనిపిస్తుంది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.