ఎవరి పాపం..ఎవరికి శాపం? అమరుల కుటుంబాల ప్రశ్న ???

· తెలంగాణ
రచయితలు

రాజకీయ  నిరుద్యోగులు మొదలుపెట్టిన వ్యాపారోద్యమం ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుని గోడలమీద పటాలుగా మారి తల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చి నీచ రాజకీయ,ఉద్యమ నాయకుల(?) చావు బేరాలకు ఉపయోగపడటం తప్ప ఈ అమాయకులు ఆత్మహత్యల ద్వారా సంధించినది ఏమిటి???

____________________________________________________________________

“మాకు పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ కోసం ముందు నిలిచాం. దెబ్బలు తిన్నాం. మా వాళ్లను కోల్పోయాం. మేమూ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. కానీ… మా త్యాగానికి స్పందనేదీ? సార్థకతేదీ?” ఇది… అమరుల కుటుంబానికి చెందిన రేణుక వేసిన ప్రశ్న! ‘అమరులకు ఇచ్చిన హామీలూ… ఎన్నికల హామీల్లాగే మారిపోయాయి’ అనేంత స్థాయిలో నిర్వేదం! బంగారు భవిష్యత్తు ముందున్న భూమారెడ్డి… నిరుపేద తండ్రికి చేదోడు వాదోడుగా గొర్రెల కాపరిగా మారిన పృథ్వీరాజ్… ఎందుకు అమరులయ్యారు? ఈ అమర వీరుల కుటుంబాల అంతరంగం తెలుసుకునేందుకు ‘ఆన్‌లైన్’ చేసిన ప్రయత్నంలో మనసులను కదిలించే ఆవేదనలు, రాతి హృదయాలను సైతం కరిగించే కన్నీళ్లు, గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలు ఎన్నో…

“మాకు పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ కోసం ముందు నిలిచాం. దెబ్బలు తిన్నాం. మా వాళ్లను కోల్పోయాం. మేమూ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. కానీ… మా త్యాగానికి స్పందనేదీ? సార్థకమేదీ?” ఇది… రేణుక అనే అమరుల కుటుంబానికి చెందిన వ్యక్తి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ జరిపిన చర్చలో వేసిన ప్రశ్న! ఎవరిది త్యాగం? ఎవరిది పాపం? ఎవరికి శాపం? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. ‘అమరులకు ఇచ్చిన హామీలూ… ఎన్నికల హామీల్లాగే మారిపోయాయి’ అనేంత స్థాయిలో నిర్వేదం!

బంగారు భవిష్యత్తు ముందున్న భూమారెడ్డి…. నిరుపేద తండ్రికి చేదోడు వాదోడుగా గొర్రెల కాపరిగా మారిన పృథ్వీరాజ్…. ఎందుకు అమరులయ్యారు? వీరి త్యాగం ఫలించేందుకు నేతలు ఏం చేయాలి? ఈ అమర వీరుల కుటుంబాల అంతరంగం తెలుసుకునేందుకు ‘ఆన్‌లైన్’ చేసిన ప్రయత్నంలో మనసులను కదిలించే ఆవేదనలు, రాతి హృదయాలను సైతం కరిగించే కన్నీళ్లు, నేతలను అడిగే ప్రశ్నలు ఎన్నో కనిపించాయి.

గారంగా చూసుకునే అమ్మానాన్న… హైదరాబాద్‌లో చదువు… వర్తమానంలో ఏ దిగులూ లేదు! బంగారు భవిష్యత్తు ముందుంది. అయినా… ఆ యువకుడు ఆత్మాహుతి బాటలో నడిచాడు! తెలంగాణ కోసం చావు కేక వినిపించారు. ఇది… ఏనుగు భూమారెడ్డి వ్యథ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగావ్ గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి, లింగమ్మల కుమారుడు భూమారెడ్డి ఆదిలాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి… ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చాడు. మల్టీ మీడియా కోర్సులోనూ చేరాడు. 2010లో ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమంలో తానూ భాగస్వామి అయ్యాడు.

ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ప్రతి ఆందోళనలో తనూ పాల్గొన్నాడు. అదే పోరు బాటలో జోరుగా నడిచి ఉంటే బాగానే ఉండేది. కానీ… భూమారెడ్డి అకస్మాత్తుగా త్యాగాల బాట పట్టాడు. 2010 జనవరి 6న హైదరాబాద్‌లోని తన గదిలో ఉరి వేసుకు మరణించాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో బోరిగావ్‌కు వచ్చారు. సాయం చేస్తామన్నారు. కానీ… భూమారెడ్డి తండ్రి ఆర్థిక సహాయం అందుకునేందుకు నిరాకరించారు. “ఒక్క కూతురికి మూడేళ్ల క్రితం పెళ్లి చేశాను. అండదండగా ఉంటాడనుకున్న కొడుకు తెలంగాణ కోసం చనిపోయాడు. నా కొడుకు ఎలాగూ తిరిగి రాలేడు. కనీసం… అతని ఆశయమైనా నెరవేరాలి’ అని నారాయణ రెడ్డి ‘ఆన్‌లైన్’తో అన్నారు.

ఓ గొర్రెల కాపరి…
2009 నవంబర్ 29…
తెలంగాణ కోసం సిద్ధిపేటలో ఆమరణ దీక్ష చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి బయలుదేరారు. చివరికి… కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లాకు తరలించారు. కాసేపటికే… దండిగ పృథ్వీరాజ్ (19) తన గుడిసెలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతను… ఓ గొర్రెల కాపరి. ఊరు… కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ. సుశీల, గంగారాంల మొదటి కుమారుడు. ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బడి మానేశాడు.

నిరుపేద త్యాగం జిల్లా ప్రజలను కదిలించింది. టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పృథ్వీరాజ్ తల్లిదండ్రులకు రూ.50 వేలు సహాయం అందించారు. కాంగ్రెస్ నేతలు రూ.1.25 లక్షలు ఇచ్చారు. స్థానిక ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు రూ.10వేల చొప్పున తమ వంతు సహాయం అందించారు. ఈ సహాయాలేవీ ఆ కుటుంబం కష్టాలను తీర్చేవి కావు. ప్రస్తుతం… ఆ ఇంట్లో పొయ్యి వెలగడమే కష్టంగా మారింది. “మా కొడుకు కోరుకున్న తెలంగాణ రావాలి. ఇప్పటికైనా నాయకులు కల్లు తెరిచి, తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా పోరాడాలి’ అని గంగారాం, సుశీల ‘ఆన్‌లైన్’తో అన్నారు.

……………………………………………………………………………………………………………………………….

సౌజన్యం : ఆంధ్రజ్యోతి (03-2-2012)

అభిప్రాయములు

Comments RSS
  1. Jai Gottimukkala

    “మా కొడుకు కోరుకున్న తెలంగాణ రావాలి. ఇప్పటికైనా నాయకులు కల్లు తెరిచి, తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా పోరాడాలి’ అని గంగారాం, సుశీల ‘ఆన్‌లైన్’తో అన్నారు.

    Amen.

  2. john

    /ఇప్పటికైనా నాయకులు కల్లు తెరిచి/

    ప్రజలు కళ్ళు తెరిచి ఏమి జరుగుతున్నదో తెలుసుకోవల్స్నిన అవసరం చాలా ఎక్కువ ఉంది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.