కేసీఆర్.. ద్రోహి! పోలవరంపై మేం చెప్పిందంతా నిజమైంది పెగ్గుకో మాట మార్చే కక్కుర్తి కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకొంటారు?: మోత్కుపల్లి ధ్వజం

“కేసీఆర్‌కు బహుమానంగా ఆయన చెప్పిన కంపెనీకి పోలవరం టెండర్లు ఇస్తున్నారని, అర్హత లేకపోయినా వాటిని కట్టబెడుతున్నారని మేం ఇంతకాలం చెప్పిందంతా ప్రతి అక్షరం రుజువైంది. కేసీఆర్, కాంగ్రెస్ కలిసి నడిపించాలనుకొన్న వ్యవహారం బెడిసికొట్టింది. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో గత్యంతరం లేక టెండర్లు రద్దు చేశారు. ఈ టెండర్ల కోసం సకల జనుల సమ్మెను అమ్ముకొని కక్కుర్తి పడ్డ కేసీఆర్ ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకొంటారు” అని టీడీపీఎల్పీ ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు విరుచుకుపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే […]

ఎవరి పాపం..ఎవరికి శాపం? అమరుల కుటుంబాల ప్రశ్న ???

రాజకీయ  నిరుద్యోగులు మొదలుపెట్టిన వ్యాపారోద్యమం ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుని గోడలమీద పటాలుగా మారి తల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చి నీచ రాజకీయ,ఉద్యమ నాయకుల(?) చావు బేరాలకు ఉపయోగపడటం తప్ప ఈ అమాయకులు ఆత్మహత్యల ద్వారా సంధించినది ఏమిటి??? ____________________________________________________________________ “మాకు పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ కోసం ముందు నిలిచాం. దెబ్బలు తిన్నాం. మా వాళ్లను కోల్పోయాం. మేమూ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. కానీ… మా త్యాగానికి స్పందనేదీ? సార్థకతేదీ?” ఇది… అమరుల కుటుంబానికి చెందిన రేణుక వేసిన […]